
Hrudaya Sankeerthanam
పాట మనసును తేలిక చేసే ఒక సాధనం. విజ్ఞానాన్ని సులభమైన పద్దతిలో తెలియజెప్పేందుకు ఉపయోగపడే ఇంధనం. ఒక్కోసారి మనోస్థైర్యాన్ని పెంపొందించే ఆయుధం. అటువంటి కమ్మనైన పాటను దైవారాధన సమయంలోనూ, సంబరాలు చేసుకునే సందర్భాలలోనూ పాడుకోవడం అనాదిగా వస్తున్నదే. కానీ కాలం మారుతున్న కొద్దీ సాంప్రదాయపు పాటలు పాడుకునే వారి సంఖ్య తగ్గుతూవస్తోంది. మధురమైన పాటలు పాడుకునే ముచ్చటైన వైభవాన్ని వెలుగులోకి తెచ్చే మార్పుకు ఇది శ్రీకారం. మన సంస్కృతిని తెలియజేస్తూ, ఈ కాలానికి అనుగుణంగా, ఏ వయసువారైనా సులభంగా ఆలపించే విధంగా సరళరీతిలో రాయబడిన పాటల సమూహమే ఈ 'హృదయ సంకీర్తనం'.