ఇంటి పేరు // ఒక అనాధ ప్రేమ కథ ఇది // telugu beautifull love story
మన పేరు ముందు ఉండే రెండు అక్షరాలు... కేవలం ఒక ఇంటి పేరు మాత్రమే కాదు. అది ఈ సమాజం మనకు ఇచ్చే గౌరవం, మన మూలాలకు నిదర్శనం.
మరి ఆ రెండు అక్షరాలు లేని వాళ్ల పరిస్థితి ఏంటి? తప్పు ఎవరో చేస్తే, అనాథ అనే ముద్రతో జీవితాంతం శిక్ష అనుభవించే వాళ్ల ఆవేదన ఎవరికి తెలుసు?
ఇది ఒక అనాథ ప్రేమకథ.
తనకు లేని గుర్తింపును తన కష్టంతో సంపాదించుకోవాలనుకున్న ఒక యువకుడి పోరాటం.
వంశం, ఇంటి పేరు కంటే మనిషి మంచితనమే గొప్పదని నమ్మి, సర్వస్వం వదులుకుని అతని చేయి పట్టుకున్న ఒక అమ్మాయి త్యాగం.
కలిసి బతకడం కోసం సమాజాన్ని ఎదిరించిన ఆ ఇద్దరూ... ఆ తర్వాత ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు, ఒంటరితనం ఎలాంటివి?
ఈ కథ చదువుతున్నంత సేపు మీ కళ్ల ముందు కేవలం అక్షరాలు మాత్రమే ఉండవు... మన చుట్టూ ఉండే మనుషుల స్వభావాలు, ఒక తండ్రి పడే ఆవేదన, ప్రేమ కోసం పడే ఆరాటం కనిపిస్తాయి.
కథలోకి అడుగుపెట్టండి...
— మీ చైతూ